అవతార్‌ కార్‌.. అనుకుంటే అయిపోతుంది!

ABN , First Publish Date - 2021-09-15T09:29:06+05:30 IST

అవతార్‌ సినిమా స్ఫూర్తిగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌.. ‘విజన్‌ అవతార్‌’ పేరిట ఒక కొత్త కాన్సెప్ట్‌ కారును రూపొందించింది.

అవతార్‌ కార్‌.. అనుకుంటే అయిపోతుంది!

మ్యూనిక్‌, సెప్టెంబరు 14: అవతార్‌ సినిమా స్ఫూర్తిగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌.. ‘విజన్‌ అవతార్‌’ పేరిట ఒక కొత్త కాన్సెప్ట్‌ కారును రూపొందించింది. డ్రైవింగ్‌ సీటులో కూర్చున్న వ్యక్తి కారును తన ఆలోచనలతోనే నియంత్రించగలడు. ఇదీ ఆ కారు ప్రత్యేకత. డ్రైవర్‌ తన మనసులో ఏసీ ఆన్‌ అవ్వాలను కుంటే ఆన్‌ అయిపోతుంది. పాటలు వినాలనుకుంటే ఆడియో ఆన్‌ అవుతుంది. అంతే కాదు.. ఈ కారు 15 నిమిషాల్లో పూర్తిగా చార్జ్‌ అవుతుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. కారు బ్యాటరీని గ్రాఫీన్‌ టెక్నాలజీతో తయారుచేశారు. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని ఈ కారును బెంజ్‌ సంస్థ మ్యూనిక్‌ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆటోమొబైల్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తోంది.


Updated Date - 2021-09-15T09:29:06+05:30 IST