అశోక్‌ లేలాండ్‌ నుంచి ‘అవతార్‌’ ట్రక్కులు

ABN , First Publish Date - 2020-06-05T06:01:41+05:30 IST

అశోక్‌ లేలాండ్‌ ‘అవతార్‌’ పేరుతో మాడ్యులర్‌ శ్రేణి ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. మాడ్యులర్‌ ప్లాట్‌ఫామ్‌ వాహనంలో అధిక శా తం విడిభాగాలను మార్చడం ద్వారా అవసరాలకు అనుగుణంగా వాహనాన్ని రూపొందించుకోవచ్చు...

అశోక్‌ లేలాండ్‌ నుంచి ‘అవతార్‌’ ట్రక్కులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అశోక్‌ లేలాండ్‌ ‘అవతార్‌’ పేరుతో మాడ్యులర్‌ శ్రేణి ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. మాడ్యులర్‌ ప్లాట్‌ఫామ్‌ వాహనంలో అధిక శాతం విడిభాగాలను మార్చడం ద్వారా అవసరాలకు అనుగుణంగా వాహనాన్ని రూపొందించుకోవచ్చు. దేశంలో వాణిజ్య వాహనాన్ని మాడ్యులర్‌ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయడం ఇదే తొలిసారని తెలిపింది. ఐ-జెన్‌6 బీఎస్‌-6 టెక్నాలజీతో అవతార్‌ ట్రక్కులను విడుదల చేసింది. కొనుగోలుదారుడు తన అవసరాలకు అనుగుణంగా యాక్సిల్‌ కాన్ఫిగరేషన్‌, కేబిన్‌, సస్పెన్షన్‌లు మొదలైనవి ఎంచుకుంటే ఆ విధంగా వాహనాన్ని తయారు చేసి ఇస్తారు. ప్రపంచ మార్కెట్ల కోసం భారత్‌లో అవతార్‌ ట్రక్కులను తయారు చేస్తామని అశోక్‌ లేలాండ్‌ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా తెలిపారు. 


Updated Date - 2020-06-05T06:01:41+05:30 IST