విమానయానం... మరింత భారం...

ABN , First Publish Date - 2021-07-18T21:22:40+05:30 IST

విమాన ప్రయాణం మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి

విమానయానం... మరింత భారం...

న్యూఢిల్లీ : విమాన ప్రయాణం మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రిఫైనర్లు జెట్ ఇంధన ధరలను పెంచితే విమానయాన రంగం నిర్వహణ వ్యయం కూడా పెరుగుతుంది.  ఏవియేషన్ టర్బైన్ ఇంధన్(ఏటీఎఫ్) వాటా 30 శాతం నుండి 35 శాతంగా ఉంది. కరోనా నేపధ్యంలో... ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న విమానయాన సంస్థలకు జెట్ ఫ్యుయల్ ధర పెంపు మరింత భారంగా పరిణమించనుంది. ఈ ఏడాది జనవరి నుండి ఏటీఎఫ్ ధరలు 40 శాతం పెరిగాయి. కిలో లీటర్‌కు రూ. 50 వేల నుండి రూ. 70 వేలకు చేరుకుంది. 

Updated Date - 2021-07-18T21:22:40+05:30 IST