Abn logo
Dec 3 2020 @ 13:21PM

వైరల్ అవుతున్న అవిక డ్యాన్స్ వీడియో!

`చిన్నారి పెళ్లి కూతురి`గా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అవికా గోర్.. `ఉయ్యాలా జంపాలా` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. `రాజు గారి గది-3` తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకుంది. అయితే ఈ గ్యాప్‌లో అవిక సరికొత్తగా తయారైంది. బొద్దుగా ఉండే అవిక.. సన్నగా నాజూగ్గా మారిపోయింది. 


ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. అలాగే రెగ్యులర్‌గా తన డ్యాన్స్ వీడియోలను కూడా అప్‌లోడ్ చేస్తోంది. ఓ కొరియోగ్రాఫర్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను అవిక తాజాగా షేర్ చేసింది. ఆ వీడియోలో అవిక డ్యాన్స్ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. 


Advertisement
Advertisement
Advertisement