Abn logo
Apr 19 2021 @ 00:48AM

రాములోరి కల్యాణానికి రావొద్దు

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 18 : కరోనా ఉధృ తంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్‌లోని రామా లయంలో ఈ నెల 24న నిర్వహిస్తున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి భక్తులను అనుమతించడంలేదని ఆలయ కా ర్యనిర్వహణ అధికారి సి.వంశీ తెలిపారు. కరోనా సెకండ్‌వేవ్‌ లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్ర భుత్వం, దేవాదాయ, ధర్మాదాయ శాఖల ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనికి భక్తులు సహ కరించాలని విజ్ఞప్తి చేశారు.  

 

Advertisement
Advertisement