యథేచ్ఛగా మద్యం, మాంసం విక్రయాలు

ABN , First Publish Date - 2022-01-27T06:38:13+05:30 IST

శ్రీకాళహస్తిలో ఇష్టారాజ్యంగా మద్యం, మాంసం విక్రయాలు కొనసాగించారు.

యథేచ్ఛగా మద్యం, మాంసం విక్రయాలు
చికెన్‌ పకోడా కోసం గుమికూడిన జనం

శ్రీకాళహస్తి, జనవరి 26: గణతంత్ర దినోత్సవంలో భాగంగా మద్యం, మాంసం విక్రయాలు నిషేధించిన విషయం విదితమే. అయితే ఇదేం పట్టించుకోకుండా పలువురు పట్టణ వ్యాపారులు ఇష్టారాజ్యంగా మాంసం విక్రయాలు కొనసాగించారు. ప్రభుత్వ మద్యం దుకాణ సిబ్బంది ముందస్తుగా రహస్య ప్రదేశాల్లో నిల్వ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారు. బహిరంగంగా మాంసం విక్రయాలు జరుగుతున్నా ఒక్కరూ పట్టించుకోలేదు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో అక్రమ మద్యం విక్రయానికి సంబంధించి ఒక్క కేసు నమోదు కాకపోవడం విశేషం. రిపబ్లిక్‌ డే సందర్భంగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.

Updated Date - 2022-01-27T06:38:13+05:30 IST