Abn logo
Sep 17 2021 @ 21:51PM

అవ్వాతాతల ఉసురు తగలడం ఖాయం

అధికారులకు వినతిపత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి   


కోవూరు, సెప్టెంబరు 17 : వృద్ధుల పింఛన్లను తొలగించిన వైసీపీ ప్రభుత్వానికి అవ్వాతాతల  ఉసురు తగలడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవ్వాతాతల   భరోసాను పుట్టిముంచిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాడుతుందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృత్తికళాకారుల పింఛన్లను  తొలగించడం అన్యామన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోనే 2వేల పింఛన్లను తొలగించడం దారుణమన్నారు.  మడమ తిప్పనని ప్రచారం చేసుకుని ఒక్క వాగ్దానాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నెరవేర్చలేకపోయారన్నారు. అనంతరం  మండల పరిషత్‌ కార్యాలయంలో పింఛన్ల రద్దును నిరసిస్తూ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి  చెముకుల కృష్ణచైతన్య, మందా రవికుమార్‌ మాదిగ, బాలారవి, పంది రఘురామ్‌, అత్తిపల్లి శివకుమార్‌రెడ్డి, నాటకరాని వెంకట్‌, కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, సూరిశెట్టి శ్రీనివాసులు, నక్కా జాన్‌ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.