Abn logo
Apr 14 2021 @ 00:19AM

సమర్థవంతంగా ‘టీకా ఉత్సవ్‌’

అధికారులతో కలెక్టర్‌ పోలా భాస్కర్‌

పామూరు, ఏప్రిల్‌ 13: కరోనా టీకా ఉత్సవ కార్యక్రమాన్ని మండల స్థాయి అధికారులు సమన్వయంతో వ్యవహరించి సమర్ధవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సూచించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ప్రతి వార్డులకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మండల స్థాయి అధికారులతో, వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు 45 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పరి సరిగా కరోనా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలన్నారు. జిల్లాకు 50 వేల కరోనా డోసులు మంజూరయ్యాయన్నారు. వైద్యశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వైసీపీ నాయకులు కలెక్టర్‌ను కలిసి విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కరోనా రెండవ దశ ప్రమాదకరంగా తయారైందని, నిర్లక్ష్యం విడనాడి అప్రమత్తంగా ఉండేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. అనంతరం మండలంలోని రావిగుంటపల్లిలో కరోనా టీకా ఉత్సవం గురించి స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేకాధికారి సెర్ప్‌ సీఈవో నారాయణరావు, తహసీల్దార్‌ సీహెచ్‌ ఉష, ఎంపీడీవో ఎం రంగసుబ్బరాయుడు, వైద్యులు పి.రాజశేఖర్‌, సాయి పద్మ ప్రశాంతి, తేజ ప్రతిమ, వైసీపీ నాయకులు హుస్సేన్‌రెడ్డి, చప్పిడి సుబ్బయ్య, ఉప సర్పంచ్‌ వైవీ.సాయికిరణ్‌, గట్లా విజయభాస్కర్‌రెడ్డి, కందుల శ్రీనివాసులరెడ్డితో పాటు వైద్య, ఆరోగ్య, అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్యశాల  సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement