పదేళ్ల వయసులోనే సంగీతంతో రికార్డుల్లోకి!

ABN , First Publish Date - 2021-03-17T07:19:08+05:30 IST

కర్ణాటక సంగీతంలో ముత్తుస్వామి దీక్షితార్‌ కంపోజ్‌ చేసిన 33 నోటుస్వరాలు ఆతి క్లిష్టమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా సంగీతం నేర్చుకునే దశలో ఉన్న వారికి అవి చాలా కష్టంగా ఉంటాయి.

పదేళ్ల వయసులోనే సంగీతంతో రికార్డుల్లోకి!

కర్ణాటక సంగీతంలో ముత్తుస్వామి దీక్షితార్‌ కంపోజ్‌ చేసిన 33 నోటుస్వరాలు ఆతి క్లిష్టమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా సంగీతం నేర్చుకునే దశలో ఉన్న వారికి అవి చాలా కష్టంగా ఉంటాయి. అలాంటి స్వరాలను హైదరాబాద్‌కు చెందిన పదేళ్ల అర్జున్‌రెడ్డి అలవోకగా పాడాడు. దాంతో నోటుస్వరాలను పాడిన అతి పిన్న వయస్కుడిగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కాడు.


అర్జున్‌రెడ్డి 33 నోటుస్వరాలను స్వరం, సాహిత్యంతో కలిపి పాడటం విశేషం. నాలుగోతరగతి చదువుతోన్న అర్జున్‌ రెడ్డి ఎనిమిదో ఏటనే కర్ణాటక సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు. 


 ‘‘మ్యూజిక్‌ మా స్కూల్‌ కరిక్యులమ్‌లో ఒక భాగం. కానీ నాకు సంగీతం పట్ల కొంచెం ఎక్కువ ఆసక్తి. అది గమనించిన మా టీచర్లు వ్యక్తిగతంగా దృష్టిపెట్టి నాకు సంగీతం నేర్పారు’’ అని అంటాడు అర్జున్‌. అతడి ప్రతిభను చూసి టీచర్లు సైతం ముగ్ధులయ్యారు. నోటుస్వరాలను పాడిన అతి పిన్న వయస్కుడిగా అర్జున్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-03-17T07:19:08+05:30 IST