హెచ్‌సీయూ నుంచి రెండు స్మారక అవార్డులు

ABN , First Publish Date - 2021-04-20T07:06:14+05:30 IST

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రెండు స్మారక అవార్డులను ప్రవేశపెట్టిందని అధికారులు తెలిపారు. వర్సిటీ ప్రథమ వీసీ గురుభక్షు సింగ్‌,

హెచ్‌సీయూ నుంచి రెండు స్మారక అవార్డులు

రాయదుర్గం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రెండు స్మారక అవార్డులను ప్రవేశపెట్టిందని అధికారులు తెలిపారు. వర్సిటీ ప్రథమ వీసీ గురుభక్షు సింగ్‌, వర్సిటీ ప్రథమ పీహెచ్‌డీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ ఎ.శ్రీకృష్ణ పేర్లతో రెండు స్మారక పురస్కారాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వర్సిటీలోని రెడ్డి ఇనిస్టిట్యూట్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయాల్లో ఆయా రంగాల్లో అత్యుత్తమ సహకారం అందిస్తూ సేవలు చేసిన అధ్యాపకులకు ఈ అవార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అవార్డుకు ఎంపికైన వారికి వర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో షీల్డ్‌, జ్ఞాపిక, లక్ష నగదు అందజేస్తామని తెలిపారు. జాతీయ సంస్థల అధిపతులతో కూడిన నిపుణుల కమిటీ అర్హులను ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. ఈసారి ప్రొఫెసర్‌ గురుభక్షుసింగ్‌ మెమోరియల్‌ అవార్డుకు పూణేలోని ఎంసీఎల్‌ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అశ్విని నంగియా ఎంపికయ్యారని తెలిపారు. ప్రొఫెసర్‌ శ్రీకృష్ణ అవార్డుకు స్కూల్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ ఓషన్‌, అట్మాస్పియరిక్‌ సైన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ అశోక్‌ కురుమూర్తి ఎంపికైనట్లు తెలిపారు.



Updated Date - 2021-04-20T07:06:14+05:30 IST