Abn logo
Sep 27 2021 @ 22:23PM

పంటమార్పిడిపై రైతులకు అవగాహన

మాట్లాడుతున్న శాస్త్రవేత్త నాగరాజు

తాండూర్‌, సెప్టెంబరు 27: వ్యవసాయ క్షేత్రాల్లో పంటల మార్పిడిపై రైతులు అవగాహన కలిగి ఉండాలని బెల్లంపల్లి కృషి విజ్ఙాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు అన్నారు. తాండూర్‌ మండలం రేచిని రైతువేదికలో సోమవారం పలు గ్రామాల రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఒకే రకం పంటలు సాగు చేయడం వల్ల భూమి సా రం పోవడమే కాకుండా, రైతులు నష్టాలబారిన పడతారని తెలిపారు. ఏవో కిరణ్మయి, ఏఈవో శంకర్‌, రైతుబంధు  మండల కోఆర్డినేటర్‌ దత్తాత్రేయరావు, రైతులు పాల్గొన్నారు. 

  భీమారం: దాంపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం లో ప్రత్యామ్నాయ పంటలపై ఏఈవో అరుణ్‌కుమార్‌, సర్పం చు సంతోషం భాస్కర్‌రెడ్డిలు అవగాహన కల్పించారు. వరికి బదులుగా వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, పుప్పుదిను సుల పంటలను సాగు చేస్తే రైతులకు లాభాలు వస్తాయని పేర్కొన్నారు. కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. 

  హాజీపూర్‌: యాసంగిలో రైతులు వరి పంటలకు బదులు ఆరుతడి పంటలను వేసుకోవాలని కృషి విజ్ఞాన కేం ద్రం శాస్త్రవేత్త శివకృష్ణ అన్నారు. వేంపల్లి, టీకనపల్లి, కొం డాపూర్‌ గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. మండల వ్యవసాయాధికారిణి రజిత, ఏఈవోలు ఫాతిమా, కనకరాజు, ఎంపీటీసీ డేగ బాపు తదితరులు పాల్గొన్నారు. 

 మందమర్రిరూరల్‌: సారంగపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో కృషి విజ్ఞాన కేంద్రం వారు రైతులకు పం టలపై అవగాహన కల్పించారు. వ్యవసాయాధికారి వందన మాట్లాడుతూ పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్త స్రవంతి మాట్లాడుతూ మామడి, సపోట, పూల మొక్కలు బంతి, చామంతి వేసుకోవాలని సూచించారు. ఏఈవో శ్రావ్య, రైతులు పాల్గొన్నారు.