Abn logo
Aug 6 2020 @ 00:51AM

విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన

చింతలమానేపల్లి, ఆగస్టు5: చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్‌ గ్రామంలో బుధవారం రైతులకు విత్తనోత్పత్తిపై బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎంపీపీ డుబ్బుల నానయ్య పాల్గొన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు.  కార్యక్రమంలో ఎంఏఓ రాజేష్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు నాజీమ్‌ హుస్సేన్‌, సర్పంచ్‌ సుశీల-మల్లేష్‌, ఎంపిటీసీ రాజన్న, ఉప సర్పంచ్‌ భాస్కర్‌, ఏఈఓ వెంకటేష్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు. 


కౌటాల: విత్తనోత్పత్తిపై బుధవారం కౌటాల మండలంలోని ముత్తంపేట గ్రామంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ శ్రీనివాస రావు మాట్లాడుతూ  రైతులు స్వయంగా విత్తనాలు తయారు చేసే విధంగా శిక్షణ  ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బసార్కర్‌ విశ్వనాథ్‌, ఎంఏఓ రాజేష్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌ ఏఈఓలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement