విద్యార్థి దశ నుంచే సమాజంపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-03-01T06:34:34+05:30 IST

సమాజంపై విద్యార్థి దశ నుంచే అవగాహన ఏర్పరచుకోవడం అవసరమని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ తమర్భ బాబూరావునాయుడు అన్నారు.

విద్యార్థి దశ నుంచే సమాజంపై అవగాహన అవసరం
సదస్సులో మాట్లాడుతున్న బాబూరావునాయుడు


విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బాబూరావునాయుడు

పాడేరు, ఫిబ్రవరి 28: సమాజంపై విద్యార్థి దశ నుంచే అవగాహన ఏర్పరచుకోవడం అవసరమని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ తమర్భ బాబూరావునాయుడు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో పోకడలు, తాజా పరిణామాలు, భవిష్యత్తులో ఏమి జరుగుతుందనే అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు అలవాటు చేసుకుని నాయకులుగా ఎదగాలన్నారు. సమస్యలపై స్పందించడం, సంఘంగా ఏర్పడడం, సామాజిక బాధ్యతగా సమాజాభివృద్థి ఎలా తోడ్పడాలనే విషయాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావుదొర, న్యాయవాధి ప్రసాదరావునాయుడు, గిరిజన విద్యార్థి సంఘం నేతలు సుమన్‌, కిశోర్‌, మాధవరావు, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-01T06:34:34+05:30 IST