సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-10-23T04:21:04+05:30 IST

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరమని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సైబర్‌ నేరాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు.

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి, అక్టోబరు 22: సైబర్‌ నేరాలపై అవగాహన అవసరమని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సైబర్‌ నేరాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి, కష్టార్జితాన్ని ఆన్‌లైన్‌లో పెట్టుబడిగా పెట్టవద్దని సూచించారు. అధిక లాభాలను ఆశించి మోసపోవద్దని తెలిపారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా బ్యాంకు వారు ఖాతాదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేవైజీలను నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రతీ ఖాతాదారుడు తన కేవైసీ వివరాలను బ్యాంకు అధికారుల దగ్గరకు వెళ్లి నమోదు చేసుకోవాలని తెలిపారు. బ్యాంకు అధికారుల పేరిట ఫోన్‌చేసి కేవైసీ వివరాలను సేకరించి బ్యాంకు ఖాతాదారుల నుంచి డబ్బులు స్వాహా చేస్తున్నారని పేర్కొన్నారు. సైబర్‌ నేరాల వలలో పడినట్లయితే వెంటనే సైబర్‌ క్రైం.జీవివో.ఇన్‌ పోర్టల్‌ నందు చేసుకోవాలని లేదా ఫ్రీ నెంబర్‌ 155260, డయల్‌ 100కు ఫోన్‌చేసి తెలియజేయాలని తెలిపారు. అనంతరం సైబర్‌ నేరాల అవగాహనకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఏఎస్‌పీ అనోన్య, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు, సదాశివనగర్‌ సీఐ వెంకటయ్య, భిక్కనూరు సీఐ అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.
మొక్కల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
కామారెడ్డి: హరితహారంలో పెద్ద మొక్కలు నాటడానికి కావాలసిన మొక్కల కోసం మున్సిపల్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. శుక్రవారం టెలి కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. మున్సిపాలిటీల వారిగా, మండలాల వారిగా పెద్ద మొక్కలు నాటడానికి ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను పెంచుతున్నామని పేర్కొన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు, డీఎఫ్‌వో నిఖిత, మున్సిపల్‌ కమిషనర్లు దేవేందర్‌, రమేష్‌కుమార్‌, జగ్జీవన్‌ పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనుల పరిశీలన
నస్రుల్లాబాద్‌ : మండలంలోని పల్లెప్రగతి పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పరిశీలించారు. మండలంలోని మైలారం, అంకో ల్‌ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, వాటర్‌ పౌంటెన్‌ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండలంలో పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణ, ఏర్పాటు చేసిన వాటర్‌ పౌంటెన్‌ను పరిశీలించారు. అనంతరం అంకోల్‌ క్యాంపులో అవెన్యూ ప్లాంటేషన్‌ పను లను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీల జాబ్‌కార్డులను పరిశీ లించి, కూలీలకు పనులు కల్పిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పనులపై స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడే పెర్క శ్రీనివాస్‌, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, ఐకేపీ ఏపీఎం సత్యనారాయణ, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఏపీవో సౌజన్య, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మహేందర్‌, రాము, కంది మల్లేష్‌, అధికారులు, నాయకులు తదితరులున్నారు. 

Updated Date - 2021-10-23T04:21:04+05:30 IST