HYD : Cyber నేరాలపై నజర్‌.. ఒక్కో ఆయుధం ఇలా.. !

ABN , First Publish Date - 2021-10-17T12:00:41+05:30 IST

సైబర్‌ నేరాలపై అవగాహన, నివారణ కోసం సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌...

HYD : Cyber నేరాలపై నజర్‌.. ఒక్కో ఆయుధం ఇలా.. !

  • ఆయుధాలతో అవగాహన కల్పిస్తూ..
  • అమ్మవారి పోస్టర్‌ విడుదల చేసిన సీ-డాక్‌

 

హైదరాబాద్ సిటీ/కొత్తపేట : సైబర్‌ నేరాలపై అవగాహన, నివారణ కోసం సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డాక్‌) హైదరాబాద్‌శాఖ ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (ఐఎస్ఈఏ) ప్రాజెక్టు నిపుణులు రూపొందించిన దుర్గామాత పోస్టర్‌ ఆలోచింపజేస్తోంది. సైబర్‌ సంరక్షణపై మెరుగైన అవగాహన కల్పించడానికి నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్‌ మంత్‌(ఎన్‌సీఎస్ఏఎం) - అక్టోబర్‌, ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ (ఇన్‌ఫోసెక్‌) ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం(సీఈఆర్‌టీ- ఇన్‌) నేషనల్‌ ఇన్ఫర్మేటిటక్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ)లతో కలిసి సీ-డాక్‌ ఆన్‌లైన్‌ అవగాహన సెషన్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీ-డాక్‌, ఐఎస్ఈఏ అసోసియేట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ఏఎస్‌ మూర్తి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా దుర్గామాత వెబ్‌ పోస్టర్లు  www.InfoSecawareness.in వెబ్‌సైట్‌లో, సోషల్‌ మీడియా వేదికల్లో ఉంచారు. ఇంగ్లిష్‌ సహా ఎనిమిది భాషల్లో ఈ సూచలను పొందుపరిచారు.


ఒక్కో ఆయుధం ఇలా.. 

పోస్టర్‌లో దుర్గామాత చేతిలోని ఈటె.. నెటిజన్లు అవసరమైన సిస్టం బ్యాక్‌పపై దృష్టి పెట్టాలనే సూచిస్తోంది. గద సైబర్‌ నేరాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది.  సుదర్శన చక్రం ఇంటర్‌నెట్‌ భద్రతకు ప్రాధాన్యం నివ్వాలని హెచ్చరిస్తోంది. నెటిజన్లు ఎల్లపుడూ జాగరూకతతో/ అప్రమత్తంగా ఉండాలనే సూచనకు అమ్మవారి చేతిలోని కమలం ప్రతీక. విల్లంబులు సైబర్‌ సంరక్షణకు బహుళ స్థాయి ప్రామాణీకరణను గుర్తు చేస్తున్నాయి. వ్యక్తిగత గుర్తింపు, పాస్‌వర్డ్స్‌, గోప్యంగా ఉంచాల్సిన అంశాల రక్షణకు త్రిశూలం ప్రతీకగా చూపారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అత్యంత ప్రాధాన్యతా అంశంగా గుర్తించాలని కొడవలి సూచిస్తోంది. సోషల్‌ మీడియా గోప్యత అవసరాన్ని అమ్మవారి ఖడ్గం సూచిస్తోంది. ఇంటర్‌నెట్‌లో అపాయకర అంశాల పట్ల అలర్ట్‌ మెకానిజం ఉండాలనే సూచనకు శంఖం ప్రతీకగా చూపారు. అమ్మవారి గొడ్డలి నెటిజన్లకు స్పామ్‌ ఫిల్టర్‌ ప్రధాన్యంను గుర్తు చేస్తోంది. 

Updated Date - 2021-10-17T12:00:41+05:30 IST