డెంగ్యూ పట్ల అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-12-01T06:02:37+05:30 IST

డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్‌ తెలిపారు.

డెంగ్యూ పట్ల అవగాహన కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

శ్రీకాళహస్తి, నవంబరు 30: డెంగ్యూ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్‌ తెలిపారు. పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం ఆయన ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, శానిటరీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడుతూ... డెంగ్యూ చికెన్‌గున్యా కంటే ప్రమాదకర వ్యాధి అన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం ఉండదని గుర్తుచేశారు. వర్షాలు కురుస్తున్నందున ఇళ్ల నడుమ నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. నీటి తొట్టెలు, పాత టైర్లలోని నీటి నిల్వలు తొలగించాలని తెలిపారు. కార్యక్రమంలో అర్బన్‌ ఇన్‌చార్జి మెడికల్‌ అధికారి చంద్రమోహన్‌, సబ్‌యూనిట్‌ అధికారి శివయ్య, సీహెచ్‌వో రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T06:02:37+05:30 IST