డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-03-16T05:10:16+05:30 IST

ప్రస్తుతం డిజిటల్‌ లావా దేవీ (యూపీఐ)ల్లో జరుగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ హరిచందన అధికారులకు సూచించారు.

డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన కల్పించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిచందన, పాల్గొన్న అదనపు కలెక్టర్లు పద్మజారాణి, చంద్రారెడ్డి

- మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి 

- కలెక్టర్‌ హరిచందన 

నారాయణపేట టౌన్‌, మార్చి 15 : ప్రస్తుతం డిజిటల్‌ లావా దేవీ (యూపీఐ)ల్లో జరుగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ హరిచందన అధికారులకు సూచించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా డిజిటల్‌ ఫైనాన్స్‌ అనే అంశంపై మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మా ట్లాడారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం తగు చర్యలు చేపట్టాలన్నారు. చాలా మంది వీధి వ్యాపారులకు క్యూఆర్‌ కోడ్‌లను అందించడంతో వారు నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నారని ప్రత్యేకంగా వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతీ నెల నిర్వహించే ఎంఎంఎస్‌ సమావేశాల్లో పాల్గొని న్యాయపరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. అదే విధంగా మండల స్థాయి సమావేశాల్లోనూ ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. కంజూమర్‌ ఇబ్బందులకు గురైతే ఫిర్యాదులు చేయడానికి కంజ్యూమర్‌ యాప్‌లు ఉన్నాయని వాటికి ఫిర్యాదులు చేయాలన్నారు. కంజ్యూమర్‌ ఫోరం అనేది బాధ్యత గల ఫోరమని కంజ్యూమర్‌ కోర్టులో త్వరగా కేసులు పరిష్కారమయ్యే అవకాశముందన్నారు. అనంతరం వినియోగదారుల శాఖ పోస్టర్లను, చట్టానికి సంబంధించిన పుస్తకాలును విడుదల చేశారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, పద్మజా రాణి, పౌర సరఫరాల శివప్రసాద్‌, డీఎంహెచ్‌వో రాంమోహన్‌రావు, సీఈవో సిద్రామప్ప, వినియోగ దారుల స్వయం సహాయ సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజ్‌ పాల్గొన్నారు.

కూలీల సంఖ్య పెంచాలి

నారాయణపేట రూరల్‌  : జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో కూలీల సంఖ్యను పెంచేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిచందన ఆదేశించారు. మంగళవారం మండలంలోని కొల్లంపల్లిలో జరుగుతున్న ఈజీఎస్‌ పనులను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. రైతు ఇస్మాయిల్‌ పొలంలో జరుగుతున్న కందకాల పనులను పరిశీలించారు. గ్రామాల నుంచి రావడానికి ఇబ్బందులు తప్పడం లేదని కూలీలు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను కూలీల తరలింపునకు వాడుకోవాలని సర్పంచ్‌కు సూచించారు. అప్పక్‌పల్లిలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించి నీరు పట్టాలన్నారు. డంపింగ్‌ యార్డు, నర్సరీలను పరిశీ లించారు. కార్యక్రమంలో డీఆర్డీవో గోపాల్‌, వినయ్‌, ఎంపీడీవో సందీప్‌కుమార్‌, సర్పంచ్‌ సాయిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు దామోదర్‌రెడ్డి, ఖతలప్ప పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-16T05:10:16+05:30 IST