Abn logo
Oct 22 2021 @ 23:08PM

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

సూచనలు ఇస్తున్న ఉపాధ్యాయులు

దేవరపల్లి, అక్టోబరు 22: చేతులు పరిశుభ్రంగా ఉం చుకుంటే రోగాల బారిన పడరని హెచ్‌ఎం పైడియ్య అన్నారు. గ్లోబల్‌ హ్యాండ్‌ వాష్‌ వారోత్సవాల్లో భాగం గా గౌరీపట్నంలో విద్యార్థుల కు అవగాహన సదస్సు, గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఎం పైడియ్య మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందన్నారు. విద్యార్థులు భోజనానికి ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో ర్యాలీతో పాటు మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు లు అరుణ్‌కుమార్‌, ఎంఎస్‌ మహలక్ష్మి, పాఠశాల కమిటీ చైర్మన్‌ గడ్డం కుమారి, అంబేడ్కర్‌ ఫౌండేషన్‌ సభ్యులు వినయ్‌, తదితరులు పాల్గొన్నారు.