స్వయం ఉపాధి శిక్షణపై అవగాహన

ABN , First Publish Date - 2022-01-24T04:30:25+05:30 IST

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థ ఉట్నూర్‌ ఆధ్వ ర్యంలో ఆదివారం మండలంలోని కోమటిగుడ గ్రామంలో స్వయం ఉపాధి శిక్షణపై ఆర్‌సెటీ సంస్థ డైరెక్టర్‌ మంగిలాల్‌, ప్యాకల్టీ దుర్గం మల్లయ్య అవగాహన కల్పించారు.

స్వయం ఉపాధి శిక్షణపై అవగాహన
అవగాహన కల్పిస్తున్న ఆర్‌సేటీ సంస్థ డైరెక్టర్‌ మంగీలాల్‌

వాంకిడి, జనవరి 23: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థ ఉట్నూర్‌ ఆధ్వ ర్యంలో ఆదివారం మండలంలోని కోమటిగుడ గ్రామంలో స్వయం ఉపాధి శిక్షణపై ఆర్‌సెటీ సంస్థ డైరెక్టర్‌ మంగిలాల్‌, ప్యాకల్టీ దుర్గం మల్లయ్య అవగాహన కల్పించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లా డుతూ మహిళలకోసం కుట్టుమిషన్‌, మగ్గంపై 30 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. యువకులకోసం టూవీలర్‌ రిపేరింగ్‌, హౌజ్‌వైరింగ్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌పై శిక్షణ ఇస్తా మన్నారు. 18ఏళ్ల నుంచి 45 సంవ త్సరాలలోపు వయస్సు గలవారు ఇందుకు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, ఉంటుందని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ నిరుద్యోగ యువతి, యువకులు ఈనెల31లోగా దరఖాస్తు చేసుకోవా లన్నారు.

Updated Date - 2022-01-24T04:30:25+05:30 IST