కేన్సర్‌పై బీచ్‌ రోడ్డులో అవగాహన రన్‌

ABN , First Publish Date - 2021-10-25T05:35:53+05:30 IST

ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం ఉదయం బీచ్‌ రోడ్డులోని ఆర్కే బీచ్‌ కాళీమాత గుడి వద్ద కేన్సర్‌పై అవగాహన రన్‌ను నగర పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సీన్హా, విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.

కేన్సర్‌పై బీచ్‌ రోడ్డులో అవగాహన రన్‌
జెండా ఊపి రన్‌ను ప్రారంభిస్తున్న సీపీ మనీశ్‌కుమార్‌ సిన్హా, తదితరులు

బీచ్‌రోడ్డు, అక్టోబరు 24: ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం ఉదయం బీచ్‌ రోడ్డులోని ఆర్కే బీచ్‌ కాళీమాత గుడి వద్ద కేన్సర్‌పై అవగాహన రన్‌ను నగర పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సీన్హా, విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. కేన్సర్‌పై అవగాహన కల్పించడానికి గ్రేస్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌, ఏపీ పోలీసులు సంయుక్తంగా ఈ రన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ సిన్హా మాట్లాడుతూ కరోనా మహమ్మరి వల్ల ఇటువంటి కార్యక్రమాలను నిలిపివేశామని, మళ్లీ ఇప్పుడు ఈ రన్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కేన్సర్‌ రోగులకు సహాయం చేసేందుకు గ్రేస్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ పనిచేయడం అభినందనీయమన్నారు. డీసీపీ గౌతమి శాలి మాట్లాడుతూ కేన్సర్‌పై అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కేన్సర్‌ నివారణకు మందులు ఉన్నాయని,  దీనిని ఒక మహమ్మారిలా చూడాల్సిన అవసరం లేదన్నారు. కాళీమాత గుడి నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ రన్‌లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, అధికారులు ఆర్‌పీఎల్‌ శాంతికుమార్‌, రామకృష్ణారావు, అరవింద్‌ కిశోర్‌, వెంటకరావు, సతీశ్‌, సిబ్బంది, పలువురు నగరవాసులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-25T05:35:53+05:30 IST