వాయు కాలుష్యాన్ని అరికట్టాలి

ABN , First Publish Date - 2022-01-26T06:17:31+05:30 IST

వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రతీ ఒక్కరూ కంకణ బద్ధులు కావాలని ఫ్రొఫెసర్‌ ఆఫ్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ డాక్టర్‌ జె. రవికుమార్‌ పేర్కొన్నారు.

వాయు కాలుష్యాన్ని అరికట్టాలి
ప్రసంగిస్తున్న డాక్టర్‌ జె. రవికుమార్‌

వాయు కాలుష్యాన్ని అరికట్టాలి

 రామలింగేశ్వరనగర్‌, జనవరి 25 : వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రతీ ఒక్కరూ కంకణ బద్ధులు కావాలని ఫ్రొఫెసర్‌ ఆఫ్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ డాక్టర్‌ జె. రవికుమార్‌ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్‌ హోమ్‌లో మంగళవారం డాక్టర్‌ జి. సమరం అధ్యక్షతన జరిగిన  వాయు కాలుష్యం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. వాయు కాలుష్యం అనేక మొండి వ్యాధులకు మూలం అవుతుందన్నారు. 4కోట్ల 20 లక్షల మంది అకాల మరణానికి వాయు కాలుష్యమే కారణమన్నారు.  వాయు కాలుష్యం విషయంలో ప్రతీ ఒక్కరూ జాగురూకతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. డాక్టర్‌ మారు వందన సమర్పణతో సదస్సు ముగిసింది. 

Updated Date - 2022-01-26T06:17:31+05:30 IST