Abn logo
Oct 27 2021 @ 00:32AM

జీవనశైలిలో మార్పులు రొమ్ము కేన్సర్‌కు కారణం

ప్రసంగిస్తున్న వైద్య నిపుణుడు

జీవనశైలిలో మార్పులు రొమ్ము కేన్సర్‌కు కారణం

కేబీఎన్‌ ఉమెన్స్‌ స్లడీ సెంటర్‌లో జరిగిన అవగాహనా సదస్సులో

 డాక్టర్‌ కేపీ రంగనాథ్‌

వన్‌టౌన్‌, అక్టోబరు 26: జీవనశైలిలో మార్పుల కారణంగా రొమ్ము కేన్సర్‌  బాధితులు పెరుగుతున్నారని హెచ్‌జీసీ కేన్సర్‌ ఆసుసత్రి అంకాలజిస్ట్‌ కేపీ రంగనాఽథ్‌ చెప్పారు. కాకరపర్తి భావన్నారాయణ కాలేజీ ఉమెన్స్‌ స్టడీ సెంటర్‌లో మంగళవారం రొమ్ము కేన్సర్‌ అప్రమత్తతపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవనశైలిలో మార్పుల వల్ల పలు వ్యాధులకు గురవతున్నారని, వాటిలో రొమ్ము కేన్సర్‌ ఒకటని, దీనికి మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా కారణమన్నారు. యువతులు ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వకపోవడం కూడా కారణాలని పేర్కొన్నారు. అవాంఛిత గడ్డలు కనిపించినపుడు వెంటనే టెస్ట్‌లు చేయించుకోవాలన్నారు. రొమ్ము కేన్సర్‌ దశలు, ఇబ్బందులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిపై నిపుణులు వివరించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన  ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు మాట్లాడుతూ, యువత ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంతో వ్యాధులకు గురవుతున్నారని వివరించారు. విభాగం కన్వీనర్‌ ఆర్‌. జయమ్మ, ఓ శైలజ, ఐక్యూఏసీ విభాగాధిపతి డాక్టర్‌ జి. కృష్ఱవేణి పాల్గొన్నారు.