యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ.1,683 కోట్లు

ABN , First Publish Date - 2020-10-29T05:55:52+05:30 IST

ఈ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాండలోన్‌ లాభం రూ.1,683 కోట్లకు పెరిగింది. మొండిబకాయిలు

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ.1,683 కోట్లు

న్యూఢిల్లీ: ఈ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాండలోన్‌ లాభం రూ.1,683 కోట్లకు పెరిగింది. మొండిబకాయిలు తగ్గుముఖం పట్టడం లాభాల వృద్ధికి దోహదపడింది. గత ఏడాదిలో ఇదే కాలానికి బ్యాంక్‌ లాభం రూ.112.08 కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలల్లో బ్యాంక్‌ ఆదాయం రూ.19,870.07 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాదిలో ఇదే సమయానికి రాబడి రూ.19,333.57 కోట్లుగా ఉంది. ఈ సెప్టెంబరు 30 నాటికి యాక్సిస్‌ బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 4.18 శాతానికి,  నికర ఎన్‌పీఏలు 0.98 శాతానికి తగ్గాయి. దాంతో ఎన్‌పీఏల కోసం కేటాయింపులు సైతం రూ.588 కోట్లకు పరిమితమయ్యాయి. 

Updated Date - 2020-10-29T05:55:52+05:30 IST