దీపావళిని తలపిస్తున్న అయోధ్య

ABN , First Publish Date - 2020-08-05T16:36:26+05:30 IST

భూమి పూజను పురస్కరించుకుని అయోధ్య సర్వాంగసుందరంగా ముస్తాబైంది.

దీపావళిని తలపిస్తున్న అయోధ్య

అయోధ్య: భూమి పూజను పురస్కరించుకుని అయోధ్య సర్వాంగసుందరంగా ముస్తాబైంది. దీపావళి వేడుకలను తలపిస్తూ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ప్రతి వీధిలో నవ్య రామాలయం నమోనా ఫ్లెక్సీలు, ఫోటోలు దర్శనమిస్తున్నాయి. నిన్నటి నుంచి దేశంలో అన్ని చోట్ల ఇళ్లముందు దీపాలు వెలిగిస్తున్నారు. బుధవారం కూడా కొనసాగనుంది. దీపపుకాంతుల్లో సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య ముగ్దమనోహరంగా దర్శనమిస్తోంది. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిషేధాజ్ఞలు విధించారు. నగరంలోకి బయటవారిని అనుమతించరు. స్థానికులు కూడా సరైన గుర్తింపు కార్డులు చూపితేనే శంకుస్థాపనకు అనుమతిస్తారు. భూమి పూజను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 


అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరుగుతున్న శంకుస్థాపనను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్ర అన్నారు. జాతీయ ఐక్యతకు అయోధ్య చిహ్నంగా మారుతుందని, సోదర భావానికి, వారసత్వ సంస్కృతికి అద్దం పడుతుందని చెప్పారు.

Updated Date - 2020-08-05T16:36:26+05:30 IST