ఎల్బీ నగర్: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన నిధి సమీకరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. రామాలయ నిర్మాణానికి నిధులు సమీకరణ విజయవంతంగా కొనసాగుతోంది. ఎల్బీ నగర్‌లో పలు హిందూ సంస్థల ఆధ్వర్యంలో జన జాగరణ కార్యక్రమం జరిగింది. రామభక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ్ హనుమంత, ఎల్బీ నగర్ ఎస్సీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ గుండె కిరణ్ కుమార్, లింగోజీగూడ డివిజన్ అధ్యక్షుడు విజయ్ భాస్కర్, తాటికొండ యాదయ్య, పల్లె గణేశ్ గౌడ్, ప్రతాప్ చైతన్య, శ్రీధర్ రాకేశ్, భరత్ యాదవ్, ప్రశాంత్, చందు పాల్గొన్నారు.