అయోధ్య వెండి ఇటుకకు భద్రాద్రిలో పూజలు

ABN , First Publish Date - 2021-01-17T05:21:11+05:30 IST

అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణంలో ఉపయోగించే వెండి ఇటుకకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయోధ్య వెండి ఇటుకకు భద్రాద్రిలో పూజలు
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సమర్పించే వెండి ఇటుకకు హారతి సమర్పిస్తున్న భక్తులు

భద్రాచలం, జనవరి 16: అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణంలో ఉపయోగించే వెండి ఇటుకకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రవాస భారతీయులు చల్లా శ్రీనివాసరావు గాయత్రి దంపతులు అయోధ్య రామమందిర నిర్మాణానికి వెండి ఇటుకను సమర్పించారు. ఈ క్రమంలో వారి ప్రతినిధులుగా గుంటూరుకు చెందిన జూపిటర్‌ ప్రసాదరావు, పద్మజ, భద్రాచలానికి చెందిన గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పాకాల దుర్గా ప్రసాద్‌, లక్ష్మీ దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇదే సమయంలో జూపిటర్‌ ప్రసాదరావు, పద్మజ దంపతులు సేకరించిన ఏడున్నర కోట్ల శ్రీరామ లిఖిత పత్రాలకు సైతం రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పి.నరసింహారావు, సంతోష్‌, తిరుమలరావు, బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-17T05:21:11+05:30 IST