ఆయుర్వేద వైద్యులూ ఆపరేషన్‌ చేయొచ్చు!

ABN , First Publish Date - 2020-11-23T07:02:34+05:30 IST

ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై శస్త్రచికిత్సలు చేయొచ్చు! ఆయుర్వేద వైద్యంలోని కొన్ని ప్రత్యేక విభాగాల్లో పీజీ చేసిన వారికి ఈ అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది...

ఆయుర్వేద వైద్యులూ ఆపరేషన్‌ చేయొచ్చు!

  • శల్య, శాలక్య విభాగ పీజీ వైద్యులకు చాన్స్‌
  • కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ, నవంబరు 22: ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై శస్త్రచికిత్సలు చేయొచ్చు! ఆయుర్వేద వైద్యంలోని కొన్ని ప్రత్యేక విభాగాల్లో పీజీ చేసిన వారికి ఈ అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సాధారణ కణుతు లు, గ్యాంగ్రిన్‌ వచ్చిన శరీర భాగాలను తొలగించడం, ముక్కు, గొంతు, శుక్లాలు వంటి శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమ తి ఇచ్చింది. 39 సాధారణ శస్త్రచికిత్సలతో పాటు కన్ను, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన 19 శస్త్రచికిత్సలు చేసేందుకు ఆయుర్వేద వైద్యులకు అనుమతి ఇస్తూ కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ ఔషధ కేంద్ర మండలి(సీసీఐఎం) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు భారతీయ ఔషధ కేం ద్ర మండలి(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఆయుర్వేద విద్య) నియంత్రణలు -2016కు సవరణలు చేసినట్లు తెలిపింది. తాజా సవరణల మేర కు ఆయుర్వేద పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌లో శల్య, శాలక్య విభాగాల్లో విద్యనభ్యసించే వారికి పలు రకాల శస్త్రచికిత్సలు చేయడంలోనూ శిక్షణ ఇస్తారు. కేవలం శల్య, శాలక్య విభాగాల విద్యార్థులే శస్త్రచికిత్సలు చేసేందుకు అర్హులని అధికారులు తెలిపారు.


Updated Date - 2020-11-23T07:02:34+05:30 IST