కరోనాపై ‘ఆయుర్వేద’ ట్రయల్స్‌!

ABN , First Publish Date - 2020-07-10T07:14:43+05:30 IST

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధికి ఒకవైపు అల్లోపతి వైద్యులు, శాస్త్రజ్ఞులు కృషి చేస్తుండగా.. ఇప్పుడు అమెరికా, భారతదేశాల్లోని ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులూ రంగంలోకి దిగారు...

కరోనాపై ‘ఆయుర్వేద’ ట్రయల్స్‌!

వాషింగ్టన్‌, జూలై 9: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధికి ఒకవైపు అల్లోపతి వైద్యులు, శాస్త్రజ్ఞులు కృషి చేస్తుండగా.. ఇప్పుడు అమెరికా, భారతదేశాల్లోని ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులూ రంగంలోకి దిగారు. ఆ వైర్‌సకు చెక్‌ పెట్టే ఆయుర్వేద ఔషధాలతో సంయుక్తంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారని అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు తెలిపారు. ఇందుకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారని వివరించారు.


భారత సంతతికి చెందిన అమెరికన్‌ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వైద్యులతో బుధవారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే.. సంయుక్త పరిశోధనలు, బోధన, శిక్షణ కార్యక్రమాల ద్వారా ఆయుర్వేదానికి ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రాణాలను కాపాడే ఔషధాలు, వ్యాక్సిన్లను తక్కువ ధరలో ఉత్పత్తి చేయడంలో భారత ఫార్మా కంపెనీలు ప్రపంచనేతలుగా నిలిచాయని ఆయన అన్నారు. 


Updated Date - 2020-07-10T07:14:43+05:30 IST