సైబర్ వలలో ఆయుర్వేద డాక్టర్‌

ABN , First Publish Date - 2021-06-30T02:40:07+05:30 IST

సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా అత్యాశకు వెళ్లి విద్యావంతులు కూడా

సైబర్ వలలో ఆయుర్వేద డాక్టర్‌

హైదరాబాద్‌:  సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా అత్యాశకు వెళ్లి విద్యావంతులు కూడా మోసపోతున్నారు. తాజాగా నగరంలోని  సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఆయుర్వేద డాక్టర్‌ మోసపోయింది. మెహిదీపట్నంకు చెందిన ఆయుర్వేద డాక్టర్‌ శైలాను సైబర్ చీటర్ ట్రాప్ చేసాడు. నైజీరియాకు చెందిన జేమ్స్‌ మారియో ఆమె నుండి నలభై లక్షల రూపాయలను సైబర్‌ చీటర్‌ కాజేసాడు. అమెరికా కంపెనీకి మెడిసిన్ ఫార్ములా విక్రయిస్తే 5 కోట్లు ఇప్పిస్తానని డాక్టర్‌‌కు ఆఫర్ చేశాడు. డాలర్స్ ఎక్స్‌చేంజ్‌, ట్రాన్స్‌ఫర్‌ చార్జెస్‌ అంటూ శైలా నుంచి 40 లక్షల రూపాయలను సైబర్ చీటర్ కాజేసాడు.  చివరికి తాను మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైమ్స్‌లో బాధితురాలు డాక్టర్‌ శైలా ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2021-06-30T02:40:07+05:30 IST