కరోనా నుంచి రక్ష! - ఆయుర్వేదం

ABN , First Publish Date - 2020-10-13T05:30:00+05:30 IST

రోగనిరోధకశక్తి పెంపొందించుకుంటే కరోనా నుంచి రక్షణ పొందవచ్చనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్‌ ఆయుష్‌ కొన్ని సూచనలు చేస్తోంది. అవేమిటంటే....

కరోనా నుంచి రక్ష! - ఆయుర్వేదం

రోగనిరోధకశక్తి పెంపొందించుకుంటే కరోనా నుంచి రక్షణ పొందవచ్చనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్‌ ఆయుష్‌ కొన్ని సూచనలు చేస్తోంది. అవేమిటంటే....


  1. ప్రతి రోజూ ఉదయం ఒక టీస్పూను చ్యవనప్రాశ్‌ తినాలి. మధుమేహులు తీపి కలపని చ్యవనప్రాశ్‌ను ఎంచుకోవాలి.
  2. తులసి, దాల్చినచెక్క, మిరియాలు, శొంఠి, ఎండుద్రాక్ష, బెల్లం లేదా నిమ్మరసం కలిపి తయారుచేసిన డికాక్షన్‌ లేదా టీ రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగాలి.
  3. 150 మిల్లీలీటర్ల వేడి పాలలో అర టీస్పూను పసుపు కలిపి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగాలి.
  4. రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి.
  5. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు ప్రాణాయామం, యోగా, ధ్యానం సాధన చేయాలి.
  6. వంటకాల్లో పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వాడాలి.
  7. ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె /కొబ్బరినూనె లేదా నెయ్యి నాసికా రంధ్రాల్లో పూసుకోవాలి.
  8. ఒక టేబుల్‌స్పూను నువ్వులనూనె లేదా కొబ్బరినూనెను నోట్లో వేసుకుని, రెండు నుంచి మూడు నిమిషాల పాటు పుక్కిలించి, ఉమ్మి వేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో నోరు కడుక్కోవాలి. ఇలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చేయాలి.

Updated Date - 2020-10-13T05:30:00+05:30 IST