మంత్రి కన్నబాబు వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు కౌంటర్

ABN , First Publish Date - 2021-09-01T02:35:03+05:30 IST

మంత్రి కన్నబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు.

మంత్రి కన్నబాబు వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు కౌంటర్

అమరావతి: మంత్రి కన్నబాబు వ్యాఖ్యలపై  మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. ‘ఏ పార్టీ రోటికాడ ఆ పార్టీ పాట పాడే కుర‌సాల క‌న్న‌బాబా..లోకేష్ భాష గురించి మాట్లాడేది? మీ స‌హ‌చ‌ర మంత్రి కొడాలి నాని అంత స‌భ్య‌త‌గా లోకేష్ మాట్లాడలేద‌ని బాధ‌ప‌డుతున్నావా?  మీ తాడేప‌ల్లి ప్ర‌భువుకి లండ‌న్ మందులు అయిపోయాయ‌ట క‌దా!జాగ్ర‌త్త‌గా వుండండి. కొరికినా, కొట్టినా ఎవ‌రికీ చెప్పుకోలేరు. నారా లోకేష్‌ని బ‌య‌ట తిర‌గ‌నివ్వ‌నంటున్నావు.. రాష్ట్రం మీ తాత జాగీరా? మా లోకేష్ రెండున్న‌రేళ్లుగా జ‌నంలోనే ధైర్యంగా తిరుగుతున్నాడు. మీ జ‌గ‌నే తాడేప‌ల్లి గ‌డ‌ప దాటి రెండేళ్లు దాటిపోయింది. ఓ సారి బ‌య‌ట‌కి ర‌మ్మ‌ను.పోవాలి జ‌గ‌న్‌..మాకొద్దు జ‌గ‌న్ అంటూ జ‌నం.రాళ్లిచ్చి కొడ‌తారు’’ అని అయ్యన్నపాత్రుడు ట్విట్ చేశారు. 

Updated Date - 2021-09-01T02:35:03+05:30 IST