అవినీతి జరిగితే క్షమించనన్న సీఎం ఇప్పుడు ఏమయ్యారు?: అయ్యన్న

ABN , First Publish Date - 2020-09-24T19:47:43+05:30 IST

విశాఖ: కార్మిక శాఖ మంత్రి జయరాం మీద చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, అయ్యన్నపాత్రుడు,

అవినీతి జరిగితే క్షమించనన్న సీఎం ఇప్పుడు ఏమయ్యారు?: అయ్యన్న

విశాఖ: కార్మిక శాఖ మంత్రి జయరాం మీద చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఇతర టీడీపీ నేతలు ఏసీబీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. కార్మిక శాఖ మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ అవినీతిని తాను ఆధారాలతో బయట పెట్టానన్నారు. ఒక వ్యాపారస్తుడు అంత ఖరీదైన కారు ఎందుకు బహుమతి ఇచ్చారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అవినీతి జరిగితే క్షమించను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమయ్యారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘అవినీతి పై ఫిర్యాదు చేయడానికి ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఇదివరకే నేను కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి పిర్యాదు చేశాను. ఇంతవరకూ స్పందన లేదు. ఈఎస్‌ఐ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తితో మంత్రి, ఆయన తనయుడు ఫోటో ఎందుకు దిగారు? ఈఎస్‌ఐ కేసులో మంత్రి అవినీతి చేశారని ఆధారాలు చూపించిన ఎందుకు స్పందించడం లేదు? ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవలసింది పోయి మంత్రిని కాపాడాలని చూస్తున్నారు.


అచ్చెన్నాయుడుని ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేశారు. వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు చూపిస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. మంత్రి జయరాంని వెంటనే మంత్రి పదవి నుంచి తొలిగించాలి. ఈఎస్ఐ నిధులను ఏం చేస్తున్నారో తెలియడం లేదు. 450 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో చెప్పాలి. ఏసీబీపై మాకు నమ్మకం ఉంది. అచ్చెన్నాయుడు కేసులో ఒత్తిడులు వచ్చిన ఏసీబీ అధికారులు నిజాయితీగా పని చేశారు. ఏసీబీ వద్ద న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తాం.మంత్రి జయరాంకి, నాకు పరిచయం లేదు. వ్యక్తిగతంగా కక్ష సాధించవలసిన అవసరం నాకు లేదు’’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-24T19:47:43+05:30 IST