Abn logo
Aug 27 2021 @ 14:49PM

ఉత్తరాంధ్రని సీఎం జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారు: అయ్యన్నపాత్రుడు

విశాఖ: ఉత్తరాంధ్రని సీఎం జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 30న ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక నిర్వహిస్తామని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తుంటే.. వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ సహా పలు ప్రాజెక్ట్‌లను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలను ఎలా అమ్ముతారు? అని ప్రశ్నించారు. సింహాచలం భూములను, ప్రైవేట్ ఆస్తులను దోచుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.

క్రైమ్ మరిన్ని...