విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షి: అయ్యన్నపాత్రుడు

ABN , First Publish Date - 2020-09-29T21:39:39+05:30 IST

విశాఖ: ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షి: అయ్యన్నపాత్రుడు

విశాఖ: ఎంపీ విజయసాయి రెడ్డిపై  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షి అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు కుటుంబం అంటే తులసివనం లాంటిదన్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన పురందేశ్వరిని మీరు విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. మీకు ఆ అర్హత ఉందా అని ప్రశ్నించారు. విజయ్ సాయి రెడ్డి గంజాయి వనంలో గంజాయి మొక్క లాంటివాడని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో దొంగలు రాజ్యమేలుతారు అంటే తాను నమ్మలేదని ఇప్పుడు చూస్తున్నానని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 




Updated Date - 2020-09-29T21:39:39+05:30 IST