Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేడుకగా అయ్యప్పస్వామి జ్యోతుల ఉత్సవం

సూళ్లూరుపేట, డిసెంబరు 2 : శ్రీ అయ్యప్పస్వామికి 23వ జ్యోతుల గ్రామోత్సవం వేడుకగా జరిగింది. గురువారం షార్‌ బస్టాండ్‌ వద్ద ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో అయప్పస్వామికి నెయ్యిఅబిషేకం, గణపతిపూజ, నవగ్రహ పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, గణపతి హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూల అలంకరణ చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. చివరగా 18 మెట్లకు పడికట్ల పూజ, అఖండ కర్పూరజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప భక్తబృందం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

Advertisement
Advertisement