Abn logo
Sep 24 2021 @ 03:49AM

రండి..మనిద్దరం ఆడుకుందాం

పాక్‌తో సిరీస్‌కు అఫ్ఘాన్‌ ప్రతిపాదన

కరాచీ: వరుసపెట్టి దేశాలన్నీ పర్యటనలను రద్దు చేసుకుంటున్న వేళ పాకిస్థాన్‌కు అఫ్ఘానిస్థాన్‌ అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. తమ జట్టుతో వన్డే సిరీస్‌ ఆడేందుకు రావాలని పాకిస్థాన్‌ను ఆహ్వానించింది. శనివారంనుంచి తాను పాకిస్థాన్‌లో జరిపే పర్యటన సందర్భంగా ఈ సిరీస్‌ను ప్రతిపాదించనున్నట్టు అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ కొత్త చైర్మన్‌ అజీజుల్లా ఫజ్లీ తెలిపాడు. పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ రమీజ్‌ రాజాను కలవనున్నట్టు చెప్పాడు. తమ జట్టుతో మూడు వన్డేల సిరీ్‌సకు ప్రతిపాదించనున్నట్టు తెలిపాడు. వాస్తవంగా పాక్‌-అఫ్ఘాన్‌ మధ్య ఈ వన్డే మ్యాచ్‌లు ఈనెలలో శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే లంకలో కొవిడ్‌ విజృంభణ, జట్ల ప్రయాణ సమస్యల దృష్ట్యా సిరీస్‌ రద్దయింది. పాకిస్థాన్‌ తర్వాత భారత్‌, బంగ్లాదేశ్‌, యూఏఈ కూడా వెళ్లి ఆయా క్రికెట్‌ బోర్డుల అధికారులను కలవనున్నట్టు అజీజుల్లా వెల్లడించాడు.