Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాక్ గెలవగానే ఈయన కన్నీరుమున్నీరయ్యారు

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన పాకిస్థాన్ చరిత్రను తిరగరాసింది. జట్టును అద్భుతంగా నడిపించిన కెప్టెన్ బాబర్ ఆజం.. విజయంతో టోర్నీని ఆరంభించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్దేశించిన 152 పరుగుల విజయ లక్ష్యాన్ని ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ (79), బాబర్ ఆజం (68) ఊదిపడేశారు. టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ పది వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇదే తొలిసారి. అలాగే, భారత్‌పై ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.

టీమిండియాపై పాకిస్థాన్ జట్టు విజయం సాధించగానే స్టాండ్స్‌‌లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న బాబర్ ఆజం తండ్రి ఆజం సిద్దిఖీ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. కుమారుడి అద్భుత ప్రదర్శన చూసిన సిద్దిఖీ తనను తాను నియంత్రించుకోలేకపోయారు. ఒక్కసారిగా ఏడ్చేశారు. స్నేహితులు, అభిమానులు ఆయనను ప్రశంసిస్తూనే ఊరడించారు.   


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement