Abn logo
Oct 26 2021 @ 02:48AM

బాబర్‌ తండ్రి భావోద్వేగం

దుబాయ్‌: దాదాపు 30 ఏళ్లుగా సాధించలేని ఘనతను తన కుమారుడి కెప్టెన్సీలో పాకిస్థాన్‌ జట్టు అందుకోవడంతో బాబర్‌ ఆజమ్‌ తండ్రి ఆజమ్‌ సిద్దిఖీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆదివారం నాటి టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 10 వికెట్లతో టీమిండియాపై నెగ్గిన సంగతి తెలిసిందే. దాంతో ప్రపంచకప్‌లలో 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌పై పాక్‌ తొలిసారి గెలుపు రుచిచూసింది. ఈ నేపథ్యంలో.. మ్యాచ్‌ అనంతరం సిద్దిఖీ ఉద్వేగం పట్టలేక బోరుమని ఏడ్చేశాడు. పాకిస్థాన్‌ విజయం అనంతరం పెద్ద సంఖ్యలో ఆ జట్టు ఫ్యాన్స్‌, బాబర్‌ ఆజమ్‌ స్నేహితులు వచ్చి సిద్దిఖీని అభినందనల్లో ముంచెత్తారు. 

క్రైమ్ మరిన్ని...