ఎవరూ కూల్చకపోతే.. మసీదు ఎలా కూలింది?: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2020-10-01T02:01:44+05:30 IST

బాబ్రీ కేసులో తీర్పును పునఃసమీక్షించాలని కాంగ్రెస్ నేత శైలజానాథ్‌ కోరారు. ఎవరూ కూల్చకపోతే.. మసీదు ఎలా కూలింది? అని ప్రశ్నించారు

ఎవరూ కూల్చకపోతే.. మసీదు ఎలా కూలింది?: శైలజానాథ్‌

విజయవాడ: బాబ్రీ కేసులో తీర్పును పునఃసమీక్షించాలని కాంగ్రెస్ నేత శైలజానాథ్‌ కోరారు. ఎవరూ కూల్చకపోతే.. మసీదు ఎలా కూలింది? అని ప్రశ్నించారు. 28 ఏళ్ల తర్వాత సాక్ష్యాల్లో పసలేదనడం ప్రభుత్వానికి అవమానంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం సీబీఐని చెప్పుచేతల్లో పెట్టుకుందని, బీజేపీ నేతల హస్తం లేకుంటే ఇన్నేళ్లు విచారణ ఎందుకు? అని శైలజానాథ్‌ ప్రశ్నించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. అయితే కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Updated Date - 2020-10-01T02:01:44+05:30 IST