వార్తల్లో ఉండేందుకు దిలీప్ ఏమైనా చేస్తారు: బాబుల్ సుప్రియో!

ABN , First Publish Date - 2021-08-02T16:31:18+05:30 IST

ఇటీవల రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన...

వార్తల్లో ఉండేందుకు దిలీప్ ఏమైనా చేస్తారు: బాబుల్ సుప్రియో!

కోల్‌కతా: ఇటీవల రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన  బాబుల్ సుప్రియో మళ్లీ మరో ఫేస్‌బుక్ పోస్టు పెట్టారు. దీనిలో ఆయన బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్‌తో పాటు టీఎంసీ నేత కుణాల్ ఘోష్‌లపై పలు ఆరోపణలు గుప్పించారు. అలాగే దిలీప్ ఘోష్, కుణాల్ ఘోష్ కామెంట్ల స్క్రీన్ షాట్‌లను కూడా జతచేశారు. దిలీప్ ఘోష్... వార్తల్లో ఉండేందుకు ఏమైనా చేస్తారని బాబుల్ సుప్రియో ఆ పోస్టులో పేర్కొన్నారు. దిలీప్ ఘోష్, కుణాల్ ఘోష్ చేసిన కామెంట్లను తాను చదివానని, తన మాటలపై వారికి నచ్చినట్లు వ్యాఖ్యానాలు చేశారన్నారు. వీటికి తాను చేతలతోనే సమాధానం చెబుతానన్నారు. తాను ఇప్పుడు కెరియర్‌ఫై దృష్టి సారించానని, మరేమీ పట్టించుకోనని అన్నారు. 

Updated Date - 2021-08-02T16:31:18+05:30 IST