రాణించిన బాబర్‌, ఫఖర్‌

ABN , First Publish Date - 2021-10-19T07:48:58+05:30 IST

వెస్టిండీస్‌తో వామప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధిం చింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (41 బంతుల్లో 50) అర్ధసెంచరీతో రాణించగా..

రాణించిన బాబర్‌, ఫఖర్‌

విండీస్‌పై పాక్‌ గెలుపు

దుబాయ్‌: వెస్టిండీస్‌తో వామప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌  7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (41 బంతుల్లో 50) అర్ధసెంచరీతో రాణించగా ఫఖర్‌ జమాన్‌ (24 బంతుల్లో 46 నాటౌట్‌) తుదికంటా నిలిచాడు. ముందుగా విండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 130 పరుగులు చేసింది. హెట్‌మయెర్‌ (28), పొలార్డ్‌ (20), గేల్‌ (20) ఓ మాదిరిగా ఆడారు. ఛేదనలో పాక్‌ 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 131 రన్స్‌ చేసి నెగ్గింది.


వెస్టిండీస్‌:

20 ఓవర్లలో 130/7 (హెట్‌మయెర్‌ 28; హసన్‌ అలీ 2/21, హరీస్‌ రౌఫ్‌ 2/32, షహీన్‌ షా అఫ్రీది 2/41). 

పాకిస్థాన్‌:

15.3 ఓవర్లలో 131/3. (బాబర్‌ ఆజమ్‌ 50, ఫఖర్‌ జమాన్‌ 46 నాటౌట్‌; వాల్ష్‌ 2/41).

Updated Date - 2021-10-19T07:48:58+05:30 IST