బైక్‌పై.. ఆటోలో.. అష్టకష్టాలు పడి ఆ గర్భిణీ ఆస్పత్రికి చేరుకున్నా.. పుట్టిన రెండు గంటలకే..

ABN , First Publish Date - 2020-07-21T20:30:48+05:30 IST

ఆ తండా నికి రోడ్డు సౌకర్యం లేక, అంబులెన్స్‌ సమయానికి రాకపోవడంతో పుట్టిన రెండు గంటలకు ఓ శిశువు మరణిం చింది. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్‌ గ్రామ పం చాయతీ పరిధి పీసరగుట్ట తండాలో ఈ విషాధకర ఘటన చోటు చేసు కుంది.

బైక్‌పై.. ఆటోలో.. అష్టకష్టాలు పడి ఆ గర్భిణీ ఆస్పత్రికి చేరుకున్నా.. పుట్టిన రెండు గంటలకే..

సిరికొండ(నిజామాబాద్): ఆ తండా నికి రోడ్డు సౌకర్యం లేక, అంబులెన్స్‌ సమయానికి రాకపోవడంతో పుట్టిన రెండు గంటలకు ఓ శిశువు మరణిం చింది. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్‌ గ్రామ పం చాయతీ పరిధి పీసరగుట్ట తండాలో ఈ విషాధకర ఘటన చోటు చేసు కుంది. తండాకు చెందిన మాలవత్‌ బాలు భార్య మమత పురిటినొప్పుల తో బాధపడగా అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. రోడ్డు బాగాలేకపోవడంతో అంబు లెన్స్‌ రాలేదు. దీంతో తండా నుంచి హొన్నాజిపేట్‌ వరకు మోటార్‌బైక్‌పై తీసుకువచ్చారు. హొన్నాజిపేట్‌ నుంచి సిరికొండ ఆసుపత్రికి ట్రాలీ ఆటోలో ఆసుప త్రికి తీసుకురాగా, మమత బాబుకు జన్మనిచ్చింది. కానీ పుట్టిన రెండు గంటల కే బాబు చనిపోయాడని తండాకు చెందిన తిరుపతి చెప్పారు. మమతను ఆ లస్యంగా ఆసుపత్రికి తీసుకురావడంతోనే సరైన చికిత్స అందలేదని, ప్రతీ వర్షాకాలంలో ఇలాంటి బాధలు తాము అనేకం ఎదుర్కొంటున్నామని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 


ఉమ్మనీరు మింగడంతో బాబు చనిపోయాడు: డాక్టర్‌ మోహన్‌

పురిటి నొప్పులతో బాధపడుతున్న మమతను ఆసుపత్రికి ఆలస్యంగా తీసుకువచ్చారు. ఆసుపత్రికి రాగానే ప్రసవం చేశాం. శిశువు ఉమ్మనీరు మింగడంతో చనిపోయాడు. శిశువు చేతులు నీలిరంగులోకి మారడంతో పిల్లల వైద్యుడి వద్దకు తీసుకువెళ్లాలని సూచించాము.

Updated Date - 2020-07-21T20:30:48+05:30 IST