వైద్యుల నిర్ల‌క్ష్యం.. న‌వ‌జాత శిశువుకు న‌ర‌కం!

ABN , First Publish Date - 2021-06-22T19:47:56+05:30 IST

సీజేరియ‌న్ స‌మయంలో వైద్యుల నిర్ల‌క్ష్యం న‌వ‌జాత శిశువుకు న‌ర‌కంగా మారింది.

వైద్యుల నిర్ల‌క్ష్యం.. న‌వ‌జాత శిశువుకు న‌ర‌కం!

కొల‌రాడో: సీజేరియ‌న్ స‌మయంలో వైద్యుల నిర్ల‌క్ష్యం న‌వ‌జాత శిశువుకు న‌ర‌కంగా మారింది. ఆప‌రేష‌న్ స‌మ‌యంలో చిన్నారి ముఖంపై క‌త్తిగాటు ప‌డ‌డంతో ఏకంగా 13 కుట్లు ప‌డ్డాయి. అస‌లేం జ‌రిగిందంటే.. కొల‌రాడోకు చెందిన‌ కేన్నీ విలియ‌మ్స్ అనే మ‌హిళకు పురుటీనొప్పులు రావ‌డంతో కుటుంబ స‌భ్యులు స‌మీపంలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మొద‌ట వైద్యులు నార్మ‌ల్ డెలివ‌రీ అనే చెప్పారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికి బిడ్డ అడ్డం తిరిగింద‌ని సీజేరియ‌న్ చేయాలంటూ హ‌డావుడిగా ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు తీసుకెళ్లారు. సీజేరియన్ చేసే స‌మయంలో వైద్యులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో చిన్నారి ముఖంపై బ‌ల‌మైన క‌త్తిగాటు ప‌డింది. దాంతో 13 కుట్లు ప‌డ్డాయి. వైద్యుల నిర్వాకం వ‌ల్లే త‌మ చిన్నారికి ఈ ప‌రిస్థితి దాపురించింద‌ని కేన్నీ విలియ‌మ్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బిడ్డ నొప్పితో విల‌విల్లాడుతుంటే బాధ‌గా ఉంద‌ని వాపోయింది. 'గోఫండ్‌మీ పేజీ' క్రియేట్ చేసి నిధుల స‌మీక‌రిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ నిధుల ద్వారా ఓ లాయ‌ర్‌ను నియ‌మించుకుని త‌మ‌కు న్యాయం జ‌రిగేలా పోరాడుతామంటూ కేన్నీ విలియ‌మ్స్ చెప్పుకొచ్చింది. ఇక చిన్నారి ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వైద్యుల తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.     

Updated Date - 2021-06-22T19:47:56+05:30 IST