Abn logo
Oct 22 2021 @ 01:14AM

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఏడాది వయసున్న బాబు.. నెలకు రూ.75 వేలు సంపాదిస్తున్నాడు.. ఆశ్చర్యపోతున్నారా..? అసలు కథేంటంటే..

సోషల్ మీడియాలో ఎంతోమంది ఫేమస్ అయ్యారు. లక్షల మంది ఫ్యాన్స్‌ను సందించుకున్నారు. వేల రూపాయలను ఆడుతూ పాడుతూ సంపాదించుకుంటున్నారు. అలాంటి ఓ ఫేమస్ చిన్నారి గురించే ఇప్పుడు టాపిక్. అందరిలా వయసు వచ్చిన తర్వాత సంపాదిస్తే కిక్కేముందుటుంది.. అందుకే ఈ చిన్నారి ఏకంగా ఏడాది వయసులోనే సంపాదన మొదలుపెట్టేశాడు. ఇంతకీ చిన్నారి వయసెంతో తెలుసా..? 12 నెలలు.. అదే ఏడాది. ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..? అక్షరాలా 1000 డాలర్లు. మన కరెన్సీలో రూ.75 వేలు. నోరెళ్లబెట్టారా..! అయినా పర్లేదు చదవండి.

బేబీ బ్రిగ్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నాడు ఈ చిన్నారి. దాదాపు 30 వేల మందికి పైగా ఫ్యాన్స్ ఉన్నారీ ఆన్‌లైన్లో బుడతడికి. ఏడాది వయసులోనే అమెరికాలోని 16 రాష్ట్రాల్లో తిరిగేశాడు. అలస్కా నుంచి కాలిఫోర్నియా, ఫ్లోరిడాల వరకు, ఎక్కడికి అనుకుంటే అక్కడికి తిరుగుతూ దాదాపు ఇప్పటివరకు 45 సార్లు విమానంలో ప్రయాణించాడు. తన కొడుకు బ్రిగ్స్ గతేడాది అక్టోబర్ 14న జన్మించాడని, కేవలం 3 వారాల వయసులోనే తొలిసారి ఫ్లైట్ ఎక్కాడని బ్రిక్స్ అమ్మ జెస్ చెబుతున్నారు. 

జెస్ ఒకప్పుడు స్వయంగా పార్ట్ టైం టూరిస్ట్స్ అనే బ్లాగ్ కూడా నడుపేవారు. ఈ బ్లాగ్ నుంచే ఆమెకు ప్రయాణాలకు అవసరమయ్యే ఖర్చులకు సరిపడా డబ్బులు వచ్చేవి. అయితే 2020లో ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు చాలా భయపడ్డారట. ఇక తన కెరీర్ అయిపోయిందని అనుకున్నారట. పుట్టబోయే బిడ్డతో ట్రావెల్ చేయడం కష్టమేనని, తన కెరీర్ అయిపోయిందని బాధపడ్డానని జెస్ చెప్పారు.

‘నా భర్త, నేను ఇది చేయాలనుకున్నాం. అప్పుడే సోషల్ మీడియాలో బేబీ ట్రావెల్స్ గురించి తెలుసుకున్నాం. కానీ అలాంటి ఒక్క ఖాతా కూడా కనిపించలేదు. దాంతో ఓ గొప్ప ఐడియా తట్టింది. బిడ్డతో ట్రావెల్ చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలు, ఎదుర్కొనే ఇబ్బందుల గురించి వివరిస్తూ చేసే ప్రయాణాల గురించి వివరిస్తే బాగుటుందని ఆలోచన వచ్చింది. దీనివల్ల మొదటిసారి తల్లి అయిన యువతులకు బాగా ఉపయోగపడుతుందని అనిపించింది. బిడ్డ పుట్టిన తరువాత అదే పని చేశాం. సూపర్ సక్సెస్ అయ్యాం’ అని జెస్ చెబుతారు.

బిడ్డతో కలిసి కోవిడ్ లాక్‌డౌన్‌లలో కూడా వీరు ట్రావెల్ చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యంగా రోడ్ ట్రిప్స్, లోకల్ వెకేషన్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. ‘పెద్ద పెద్ద సిటీల్లో మేము పర్యటించలేదు. న్యూయార్క్ లాంటి సిటీలకు వెళ్లి ప్యాలెస్‌లలో ఉండాలని అనుకోలేదు. దానికి బదులుగా ఎవరికీ తెలియని ప్రదేశాలు, బయట కనిపించే అందమైన ప్రాంతాలపై దృష్టి సారించాం. బాగా సక్సెస్ అయ్యాం’ అని జెస్ చెబుతారు. ఇక్కడ ఫైనల్ టచ్ ఏంటంటే.. బేబీ బ్రిగ్స్ ఓ స్పాన్సర్ కూడా ఉన్నారు. ఆ స్పాన్సర్ బ్రిగ్స్‌కు డైపర్స్ స్పాన్సర్ చేస్తారు. 

దీనిని బట్టి చూస్తే జెస్ ఇప్పుడప్పుడే బేబీ బ్రిగ్స్‌తో ట్రావెల్ చేయడం ఆపేలా లేరు. ఇప్పటివరకు అమెరికాలోని రాష్ట్రాలకే పరిమితమైన వారి ట్రావెలింగ్ పరిమితమైంది. కానీ ఇకపై యూరప్‌, మిగతా ప్రాంతాల్లో ట్రావెల్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరి ఆల్‌ది బెస్ట్ బేబీ బ్రిగ్స్. సేఫ్ జర్నీ.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...