తాళ్లరేవులో శిశువు మృతి

ABN , First Publish Date - 2021-09-18T06:27:32+05:30 IST

తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్‌ సెంటరులో శుక్రవారం మగశిశువు మృతి చెందింది. స్థానిక మాధవరాయునిపేట గ్రామానికి చెందిన అయినవిల్లి కవిత ప్రసవం నిమిత్తం గురువారం సీహెచ్‌సీలో చేరింది. వైద్యు లు ఆమెను కాకినాడ జీజీహెచ్‌కి సిఫార్సు చేశారు.

తాళ్లరేవులో శిశువు మృతి

తాళ్లరేవు, సెప్టెంబరు 17: తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్‌ సెంటరులో శుక్రవారం మగశిశువు మృతి చెందింది. స్థానిక మాధవరాయునిపేట గ్రామానికి చెందిన అయినవిల్లి కవిత ప్రసవం నిమిత్తం గురువారం సీహెచ్‌సీలో చేరింది. వైద్యు లు ఆమెను కాకినాడ జీజీహెచ్‌కి సిఫార్సు చేశారు. 108 ఆ లస్యంగా రావడంతో ఆమెకు సీహెచ్‌సీలోనే ప్రసవం జరిగింది. కానీ మగశిశువు పేగులు చుట్టుకుని పుట్టడంతో ఊపిరి ఆడక మరణించిందని వైద్యాధికారి స్రవంతి తెలిపారు. తల్లికి బిడ్డ చనిపోయినట్లు తెలియదు. రక్తస్రావం ఎక్కువగా కావడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-09-18T06:27:32+05:30 IST