Abn logo
Sep 24 2021 @ 12:37PM

హైదరాబాద్: ప్రారంభం అయిన బీఏసీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, భట్టి విక్రమార్క,  ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, చీప్ విప్‌లు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీకి ఆహ్వానం అందలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలి, ఎంత సమయాన్ని కేటాయించాలన్న విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption