క్రిప్టో నిషేధం ప్రమాదం: బీఏసీసీ

ABN , First Publish Date - 2021-11-26T09:20:57+05:30 IST

క్రిప్టో కరెన్సీలపై గంపగుత్తగా నిషేధం విధించడం వల్ల మరిన్ని ప్రభుత్వేతర సంస్థలకు ప్రోత్సాహం ఏర్పడి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాటి వినియోగం పెరిగిపోతుందని భారత ఇంటర్నెట్‌, మొబైల్‌ అసోసియేషన్‌ (ఐఏఎంఏఐ) అనుబంధ బ్లాక్‌చెయిన్‌, క్రిప్టో ఆస్తుల మండలి (బీఏసీసీ)

క్రిప్టో నిషేధం ప్రమాదం: బీఏసీసీ

న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీలపై గంపగుత్తగా నిషేధం విధించడం వల్ల మరిన్ని ప్రభుత్వేతర సంస్థలకు ప్రోత్సాహం ఏర్పడి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాటి వినియోగం పెరిగిపోతుందని భారత ఇంటర్నెట్‌, మొబైల్‌ అసోసియేషన్‌ (ఐఏఎంఏఐ) అనుబంధ బ్లాక్‌చెయిన్‌, క్రిప్టో ఆస్తుల మండలి (బీఏసీసీ) హెచ్చరించింది. దీనికి తోడు పన్నుల ఎగవేత కూడా పెరిగిపోతుందని తెలిపింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రతికూలంగా ప్రభావితం అవుతారని పేర్కొంది. క్రిప్టోలను ఒక ఆస్తిగా మాత్రమే పరిగణించాలని కూడా బీఏసీసీ సూచించింది. క్రిప్టో ఆస్తుల వ్యాపారాలను నియంత్రించడం వల్ల ఇన్వెస్టర్లకు రక్షణ ఏర్పడడంతో పాటు కొనుగోలుదారులు, అమ్మకందారులను పర్యవేక్షించడం, పన్నులు విధించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు క్రిప్టోల వినియోగాన్ని నిలువరిండం సాధ్యపడుతుందని పేర్కొంది. 

Updated Date - 2021-11-26T09:20:57+05:30 IST