అక్రమ సంపాదనలో మంత్రుల్లో జయరామే ఫస్ట్: బచ్చుల

ABN , First Publish Date - 2020-09-18T23:13:24+05:30 IST

అక్రమ సంపాదనలో మంత్రి జయరాం మంత్రులందరికంటే ముందు వరుసలో నిలిచి జగన్‌తో పోటీపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

అక్రమ సంపాదనలో మంత్రుల్లో జయరామే ఫస్ట్: బచ్చుల

అమరావతి: అక్రమ సంపాదనలో మంత్రి జయరాం మంత్రులందరికంటే ముందు వరుసలో నిలిచి జగన్‌తో పోటీపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. ‘ఈఎస్‌ఐ విభాగాన్ని అడ్డంపెట్టుకొని కొందరు అధికారుల సాయంతో ఈఎస్ఐ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే టెండర్‌ను మంత్రి జయరాం.. కార్తీక్‌కు అప్పగించారు. జయరాం కార్మికశాఖా మంత్రిగా ఉండి పేద కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఈఎస్ఐ‌ను అవినీతి కేంద్రంగా మార్చారు. రాష్ట్రంలోని బీసీలను భయభ్రాంతులకు గురిచేయాలన్న దురుద్దేశంతోనే జగన్.. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించారు. అసలు నిందితుడైన గుమ్మనూరు జయరాంను తన పక్కన పెట్టుకున్న ముఖ్యమంత్రి.. టీడీపీ నాయకుడిపై కక్షసాధింపులకు పాల్పడ్డారు. కార్తీక్ పేరుతో ఉన్న బెంజ్ కారు.. మంత్రి కుమారుడికి పుట్టినరోజు కానుకగా అందితే ఇంకా సిగ్గులేకుండా సమర్థించుకోవాలని చూస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి నీతి నిజాయితీ ఉంటే తక్షణమే జయరాంతో రాజీనామా చేయించండి. ఈఎస్ఐతో స్కామ్‌తో సంబంధంలేని వ్యక్తి 80 రోజులు జైల్లో ఉంటే.. అసలు సూత్రధారులు మంత్రికి కానుకలిచ్చి ఆయన సాయంతో బయట తిరుగుతున్నారు. మంత్రి జయరాంకు పాపం పండింది కాబట్టే.. అయ్యన్నపాత్రుడికి మతి భ్రమించిందని మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.

Updated Date - 2020-09-18T23:13:24+05:30 IST