Abn logo
Apr 9 2021 @ 00:45AM

ముంబై నుంచి వెనక్కు?

కరోనా కేసుల్లో అనూహ్య పెరుగుదల చిత్రపరిశ్రమపై పెను ప్రభావం చూపుతోంది. కొవిడ్‌ విజృంభణతో ఓ వైపు సినిమాల విడుదల వాయిదా పడుతుండగా షూటింగ్‌ కూడా అనుకున్న విధంగా ముందుకు సాగటం లేదు. తాజాగా విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా నటిస్తోన్న ‘లైగర్‌’ చిత్రబృందం కూడా ముంబై నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమైందని సమాచారం. ముంబైలో కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో ఇకపైన షూటింగ్‌ చేయటం సాధ్యంకాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘లైగర్‌’ మిగతా షూటింగ్‌ అంతా హైదరాబాద్‌లోనే పూర్తి చేసేందుకు చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో అనన్యాపాండే కథానాయిక. చార్మీ, కరణ్‌ జోహర్‌, పూరీ జగన్నాథ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement