Advertisement
Advertisement
Abn logo
Advertisement

యూవీబీని కూడా తట్టుకునే చర్మ ఆరోగ్యానికి బాదములు

హైదరాబాద్: సూర్యకిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండేందుకు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు. అయితే ఆహారపు అలవాట్లు కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధనల్లో తేలింది. కాస్మెటిక్‌ డెర్మటాలజీలో ప్రచురితమై ఓ నూతన అధ్యయనం వెల్లడించిన దాని ప్రకారం యువీబీ కాంతి చర్యలను తట్టుకునేలా చర్మాన్ని శక్తివంతం చేయడంలో బాదములు సహాయపడతాయని వెల్లడించింది. లాస్‌ఏంజెలిస్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (యుసీఎల్‌ఏ) పరిశోధకులు ప్రతి రోజూ బాదములు తినడం వల్ల యువీబీ కాంతి(సూర్య కిరణాల వల్ల చర్మం పాడవడానికి అతి ప్రధాన కారణం) ప్రతిరోధకత ఏమైనా పెరుగుతుందా? చర్మపు కాంతిలో మార్పులేమైనా వస్తాయా? అనే అంశంపై శోధించారు. ఈ అధ్యయనంలో తమను తాము ఆసియా వాసులుగా చెప్పుకుంటున్న 18–45 సంవత్సరాల వయసు కలిగిన 29 మంది మహిళలు పాల్గొన్నారు. వీరికి ప్రతిరోజూ వివిధ మోతాదుల్లో బాదములు లేదా ప్రిజెల్‌ తీసుకోవాలని సూచించారు. అధ్యయనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో అధ్యయన ప్రారంభంలో, ముగింపు సమయంలో మినిమల్‌ ఎరిథెమా డోస్‌ (ఎంఈడీ) పరిమాణం  ఆధారంగా యువీబీ ప్రతిరోధకతను గుర్తించారు. ఆరంభంలో విభిన్న గ్రూపుల నడుమ ఎంఈడీ పరంగా పెద్దగా తేడా లేదు. కానీ 12 వారాల తరువాత పరిశీలించినప్పుడు రెండు ఎంఈడీలలోనూ వృద్ధి చూశారు. బాదములు తీసుకున్న మహిళలతో పోలిస్తే ప్రిజెల్‌ గ్రూప్‌లో కనీస ఎరిథెమా ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం గురించి  ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌, ఎండీ, పీహెచ్‌డీ, ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్ చీఫ్‌ ఆఫ్‌ ద డివిజన్‌, క్లినికల్‌ న్యూట్రిషన్‌, యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజిల్స్‌ డాక్టర్ ఝావోపింగ్ లీ మాట్లాడుతూ.. ‘‘ ఈ నిర్థిష్టమైన అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం 12 వారాల పాటు ప్రతి రోజూ42 గ్రాముల బాదములు తీసుకుంటే ఎంఈడీ మెరుగుపడుతుంది. మరీ ముఖ్యంగా ఆసియా మహిళల్లో ఇది 20% వరకూ వృద్ధి చెందింది.  ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించేదాని ప్రకారం యువీబీ కాంతికి వ్యతిరేకంగా చర్మం యొక్క అంతర్గత రక్షణకు మద్దతునందించడంలో బాదములు సహాయపడుతున్నాయి’’ అని అన్నారు.

Advertisement
Advertisement